Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్The Ashes: చివరి టెస్టులో ఇంగ్లాండ్ విజయం - సిరీస్ డ్రా

The Ashes: చివరి టెస్టులో ఇంగ్లాండ్ విజయం – సిరీస్ డ్రా

ఈ ఏడాది యాషెస్ సిరీస్ 2-2తో డ్రా గా ముగిసింది. కెన్నింగ్ టన్ ఓవల్ మైదానంలో జరుగుతోన్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 49 పరుగులతో విజయం సాధించింది. చివరి టెస్ట్ ఆడుతోన్న స్టువార్ట్ బ్రాడ్ చివరి రెండు వికెట్లూ పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

384 విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి  వికెట్ నష్ట పోకుండా 135  పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

నేడు ఐదో రోజులంచ్ సమయానికి కంగారూలు మూడు వికెట్లు కోల్పోయారు. డేవిడ్ వార్నర్-70; ఉస్మాన్ ఖవాజా-72; లబుషేన్-13  పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో స్టీవ్ స్మిత్ (54)- ట్రావిస్ హెడ్ (43)లు నాలుగో వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యంతో  ఆశలు రేకెత్తించారు. పది పరుగుల తేడాతో వీరిద్దరూ ఔటయ్యారు.  మిచెల్ మార్ష్(6); మిచెల్ స్టార్క్ (డకౌట్); కమ్మిన్స్ (9) విఫలమయ్యారు. అలెక్స్ క్యారీ 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు బ్రాడ్ బౌలింగ్ లో కీపర్ బెయిర్ స్టో కు పట్టిన క్యాచ్ కు వెనుదిరిగాడు. టాడ్ మర్ఫీ ని కూడా బ్రాడ్ అవుట్ చేసి చిరస్మరణీయ విజయం అందించాడు. 334  పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ ఓక్స్ 4; మోయిన్ అలీ 3; స్టువార్ట్ బ్రాడ్ 2; మార్క్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు.

ఐదు టెస్టుల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లూ ఆసీస్ గెలుపొందగా, మూడో టెస్ట్ ఇంగ్లాండ్ గెల్చుకుంది. నాలుగో టెస్ట్ వర్షం కారణంగా డ్రా గా ముగిసింది. ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్