Sunday, January 19, 2025
HomeTrending Newsఅవసరమైతే సిఎంను కలుస్తా

అవసరమైతే సిఎంను కలుస్తా

I am for Hindupuram district: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేసేందుకు అవసరమైతే సిఎం జగన్ తో సమావేశమవుతానని ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న మౌన దీక్ష చేపట్టిన బాలయ్య నేడు జిల్లా కలెక్టర్ కు ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. హిందూపురంలోని తన నివాసం నుంచి భారీ  కాన్వాయ్ తో అనంతపురం చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురంకు ఉన్నాయని పునరుద్ఘాటించారు. జిల్లా కేంద్రం అనేది ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ, ఎన్నో ఏళ్ళ కల అని గుర్తు చేశారు. తాము పుట్టపర్తికి వ్యతిరేకం కాదని  హిందూపురం అభివృద్ధి కోసమే తాము ఆందోళన చేస్తున్నామని, అవసరమైతే సత్యసాయి పేరు పెట్టవచ్చని సూచించారు. తమ డిమాండ్ సాధన కోసం అఖిలపక్ష నేతలతో కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు. ఎన్నో వసతులున్న హిందూపురం కాదని పుట్టపర్తి ఎంపిక చేయడం వెనుక ప్రభుత్వ ఆలోచన ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి పేరు ఏది పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు.

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలను పక్కదారి పట్టించేందుకే జిల్లాల ఏర్పాటు అంశాన్ని హఠాత్తుగా తెరపైకి చేత్తారని బాలయ్య అనుమానం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా హిందూపురంలో అభివృద్ధి పనులు ఆపేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు అయన పేరిట ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్లు  ఎందుకు ఎత్తివేశారని బాలయ్య ప్రశ్నించారు.

Also Read : హిందూపురం కోసం రాజీనామా: బాలయ్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్