Sunday, June 7, 2026
HomeTrending Newsహిందూపురం కోసం రాజీనామా: బాలయ్య

హిందూపురం కోసం రాజీనామా: బాలయ్య

Balayya for District: హిందూపురం జిల్లా కేంద్రం కోసం అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. రాజధానిగా ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురం నగరానికి ఉన్నాయని అయన స్పష్టం చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టారు. పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ హిందూపురం జిల్లాకు సత్యసాయి పేరు పెట్టాలని, కానీ జిల్లా కేంద్రంగా హిందూపురం ఉండాలని డిమాండ్ చేశారు.

‘కావాలి… కావాలి… హిందూపురం జిలా కేంద్రం కావాలి’…. ‘సాధిద్దాం సాధిద్దాం జిల్లా కేంద్రం సాధిద్దాం’ అంటూ ప్రజలతో నినాదాలు చేయించారు బాలయ్య.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై బాలకృష్ణ స్పందించారు. ప్రజలను మభ్యపెట్టడానికే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, ఎన్టీఆర్ అంటే అంత గౌరవం ఉన్నప్పుడు అయన విగ్రహాలు కొంతమంది దుండగులు ధ్వంసం చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని బాలయ్య ప్రశ్నించారు.

Also Read : కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular