Saturday, November 23, 2024
HomeTrending Newssunstroke: వడ దెబ్బ...ముందు జాగ్రత్తలు

sunstroke: వడ దెబ్బ…ముందు జాగ్రత్తలు

అధిక ఎండలో ఎక్కువ సేపు తిరిగితే వడ దెబ్బ తగలొచ్చు. తల తిరగడం , నీరసం , తలనొప్పి , వికారం , గుండెవేగం గా కొట్టుకోవడం , ఏమి జరుగుతోందో తెలియని స్థితి – ఇవీ వడ దెబ్బ తగులుతున్న వ్యక్తికి వచ్చే లక్షణాలు. ఇలాంటి వారు వెంటనే నీడ పట్టుకు వెళ్లి పోవాలి . నీరు తాగాలి . ఆలస్యం చేస్తే ప్రాణం పోవచ్చు. నీడపట్టు కు వెళ్లినా లక్షణాలు తగ్గక పొతే అంబులెన్సు కు ఫోన్ చెయ్యాలి . వైద్య సాయం పొందాలి.

వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే ..

1 . నీరు బాగా తాగాలి . దాహం వేయక పోయినా అప్పుడప్పుడు నీరు తాగుతూ ఉండాలి.

2 . మద్యం తీసుకొంటే ఒంటిలోని నీరు తగ్గిపోతుంది . వ్యక్తి నిర్జలీకరణానికి గురవుతాడు. { డీ హైడ్రేషన్ } . ఎండలో చల్లఁటి బీరు తాగడం ఒంటికి మంఛిద్దని చాలా మంది అనుకొంటారు. బీరు లో అధిక మొత్తం నీరు ఉన్న మాట వాస్తవమే. కానీ అందులో ఆల్కహాల్ వుంది కదా. దీని వల్ల ఒంటిలోని నీరు మూత్రం రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఒంటిలో నీటి శాతం తగ్గిపోతుంది. ఆల్కహాల్ వల్ల రక్త నాళాలు వ్యాకోచించి చర్మానికి రక్త ప్రసారం పెరుగుతుంది. దీనితో చెమటలు పడుతాయి. ఇది డేంజర్. మద్యం వల్ల సన్ సేన్సిటివిటి పెరిగిపోతుంది. గుర్తు పెట్టుకోండి .. ఎండ కాలం లో పగటి పూట మద్యం తాగడం, తాగి ఎండలోకి వెళ్లడం ఆత్మ హత్యా సదృశ్యం.

3 . వడ దెబ్బ తగలకుండా ఉండడానికి వీలైనంత వరకు పది నుంచి నాలుగింటి వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండాలి . తప్పని సరిగా వెళ్ళాలి వస్తే అప్పుడప్పుడు నీడ ప్రాంతానికి వెళ్లి బ్రేక్ తీసుకోవాలి.

4 . హైదరాబాద్ మినహాయిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో గాలి లో తేమ ఎక్కువ . దీని వల్ల ఎండ కాలం లో చెమటలు బాగా పడుతాయి . మజ్జిగ , కొబ్బరి నీరు లాంటివి తరచూ తీసుకోవడం , వదులుగా ఉన్న నూలు దుస్తులు ధరించడం , రోజుకు రెండు మూడు సార్లు స్నానం – ఇవి ఉపశమన మార్గాలు .

5 ఎండ నుంచి ఇంటిలోకి వచ్చిన వెంటనే చన్నీటి తో స్నానం చేయకూడదు . కనీసం అయిదు నిముషాలు గాప్ ఇవ్వాలి . ఫ్యాన్ కింద లేదా ఏసీ లో కూర్చుని పది నిముషాల తరువాత చన్నీటి స్నానం చేసుకొంటే మంచిది . అలాగే ఎండలో వున్నప్పుడు వడ దెబ్బ తగలకుండా ఉండేదుకు తల పై నీరు పోసుకోవచ్చు . కానీ నీరు పోసుకున్న అయిదు పది నిముషాలకు ఎండలోకి పోవడం లేదా ఎండనుంచి నీడకు వచ్చిన అయిదు నిముషాలకు నీరు పోసుకోవడం మంచిది .

6 . ఖీర , సొరకాయ , బీరకాయ లాంటి కాయగూరల్లో నీటి శాతం ఎక్కువ . ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి . ముఖ్యంగా ఖీర ను ప్రతిపూట తీసుకోవాలి .

7 . ఊబ ఖాయం వున్నవారికి వడ దెబ్బ తగిలే అవకాశం ఎక్కువ . వీరు తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్