Saturday, January 18, 2025
Homeసినిమా'రాజా సాబ్' అయినా రొమాంటిక్ గా కనిపించేనా? 

‘రాజా సాబ్’ అయినా రొమాంటిక్ గా కనిపించేనా? 

ప్రభాస్ కథానాయకుడిగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో దిగిపోతున్నాయి. ప్రతి సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోంది. వేల కోట్లను కొల్లగొడుతోంది. ఆ సినిమాల జయాపజయాలతో పని లేకుండా ప్రభాస్ కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తూనే వెళుతున్నాడు. అంతకుముందు సినిమాల సక్సెస్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆయన సినిమాలకు భారీ వసూళ్లను అప్పగిస్తూనే ఉన్నారు.

నిజానికి ప్రభాస్ ఇంతకుముందు చేసిన రాధే శ్యామ్ .. సాహో .. సలార్ వంటి సినిమాలు ఆయనను రొమాంటిక్ హీరోగా చూపించలేకపోయాయి. ‘రాధే శ్యామ్’ కంటెంట్ పై ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ఇక రీసెంటుగా థియేటర్లకు వచ్చిన ‘కల్కి’ సినిమాలోనైనా ప్రభాస్ వైపు నుంచి రొమాన్స్ ఉంటుందని ఆడియన్స్ ఆశించారు. కానీ ఇక్కడ కూడా ప్రేక్షకులకు నిరాశనే ఎదురైంది. దిశాపటాని వంటి బ్యూటీ అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ కథ రొమాన్స్ కి చాలా అంటే చాలా దూరంలో ఉండిపోయింది. అందువలన ప్రభాస్ అభిమానులు ఈ విషయంలో అసంతృప్తికి లోనయ్యారు.

అలాంటి అభిమానుల దృష్టి ఇప్పుడు ‘రాజా సాబ్’పైనే ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మారుతి ఎంచుకున్న కంటెంట్ చూస్తుంటే, ఈ సినిమాలో హీరోయిన్స్ సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుందనే విషయం తెలుస్తోంది. కథ విలేజ్ నేపథ్యంలో జరుగుతుంది. ప్రభాస్ లుంగీతో మాస్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందువలన ఈ సినిమాలో లవ్ .. రొమాన్స్ పుష్కలంగా ఉంటాయని నమ్ముతున్నారు. మారుతీ సినిమా కనుక, కామెడీ వైపు నుంచి ఆలోచించవలసిన అవసరం ఉండదు. తమన్ పాటలు మాస్ ఆడియన్స్ దాహం తీర్చేస్తాయని అంటున్నారు. విశ్వప్రసాద్ – వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలైతే అలా పెరిగిపోతూనే ఉన్నాయ్ మరి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్