Friday, March 29, 2024
Homeసినిమా'ఎఫ్3' చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్

‘ఎఫ్3’ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్

Clean Movie:  విక్టరీ వెంకటేష్‌, మెగా హీరో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించిన చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రానికి స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఎఫ్ 2 కి సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమా టీజ‌ర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అయితే.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 28 నిమిషాలు. ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికెట్ ఇవ్వడం పట్ల చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది. కుటుంబసభ్యులందరూ కలిసి చూడగలిగే స్వచ్ఛమైన వినోదాత్మక చిత్రం ఎఫ్ 3 అని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది. ఈ నెల 27న ఎఫ్ 3 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి.. భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ఎఫ్ 3 ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : మే 27నుంచి నవ్వులు పూయించనున్న‘ఎఫ్ 3’

RELATED ARTICLES

Most Popular

న్యూస్