Tuesday, June 16, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్Babu: వేధిస్తున్న వారిని వదిలిపెట్టం: బాబు హెచ్చరిక

Babu: వేధిస్తున్న వారిని వదిలిపెట్టం: బాబు హెచ్చరిక

ప్రభుత్వం పెట్టె తప్పుడు కేసులు కోర్టుల్లో నిలబడవని, న్యాయ పోరాటం చేసి కార్యకర్తలను విడిపిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా తలెత్తిన ఘర్షణల్లో కేసులు నమోదైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. ఇప్పటి వరకూ 81 మందిని అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ కేసులు పెట్టి టిడిపి కార్యకర్తలను వేధిస్తున్న వైసీపీ నేతలు, పోలీసులు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. టిడిపి నేతలు, కార్యకర్తల కుటుంబాలను ఓ తండ్రిలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్య పడవద్దని, అతి త్వరలో మంచి రోజులు వస్తాయని వారికి ధైర్యం చెప్పారు.

కాగా, ఇప్పటి వరకూ ఈ ఘటనలకు సంబంధించి 12ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేయగా, 317 మందిపై కేసులు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular