ఓటీటీ ప్రేక్షకులు థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందువలన ఓటీటీ సంస్థలు ఈ తరహా కంటెంట్ అందించడానికి ఉత్సహాన్ని చూపుతున్నాయి. అలా ఈ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చే థ్రిల్లర్ సినిమాలలో ‘ఇరుల్’ ఒకటిగా కనిపిస్తోంది. నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించిన మలయాళ మూవీ ఇది. 2021 ఏప్రిల్లో ఇది అక్కడి థియేటర్లకు వచ్చింది. కంటెంట్ పరంగా అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’ తమిళ ఓటీటీ ద్వారా తమిళ ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపటి నుంచి .. అంటే ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమాను తమిళంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఒకే పాత్ర చుట్టూ కథను తిప్పుతూ వెళ్లే ప్రయోగాలు గతంలో కొంతమంది దర్శకులు చేశారు. ఈ సినిమా కథ మాత్రం మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఈ కథ అక్కడి ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.
ఈ సినిమాలోని ప్రధానమైన మూడు పాత్రలను ఫహాద్ ఫాజిల్ .. సౌబిన్ షాహిర్ .. దర్శనా రాజేంద్రన్ పోషించారు. కథలోకి వెళితే .. ఒక వైపున వరుస హత్యలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో, తన లవర్ తో కలిసి ఒక వ్యక్తి లాంగ్ డ్రైవ్ వెళతాడు. అలావాళ్లు ఒక ఫారెస్టు ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ కారు ట్రబుల్ ఇస్తుంది. సాయం కోసం అక్కడికి దగ్గరలో కనిపించిన ఒక ఇంటికి వెళతారు. అక్కడి నుంచి వాళ్లు ఎలా బయటపడతారు? అనే ఈ కథ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఆహా తెలుగులోనూ ఈ నెలలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.