Monday, September 23, 2024
HomeTrending Newsకాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి బ్రదర్స్

కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి బ్రదర్స్

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కోతులు,కొండముచ్చుల్లా ప్రవర్తిస్తున్నారని పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. రేవంత్ కోతి అయితే బండి సంజయ్ కొండ ముచ్చులా మారారన్నారు. హైదరాబాద్ టీ.ఆర్.ఎస్.ఎల్పీ కార్యాలయంలో ఈ రోజు పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి నేతల తీరును తప్పు పట్టారు.

సంజయ్ కు నెత్తి లేదు నత్తి మాత్రమే ఉందని, రేవంత్ కు కత్తి లేదు నత్తి సుత్తి రెండు ఉన్నాయని తెరాస నేతలు ఎద్దేవా చేశారు. కోవిడ్ మార్గదర్శకాలు కేంద్రం విధించినవే అని వారిద్దరికీ తెలియవా అన్న జీవన్ రెడ్డి హైకోర్టు సూచనలు కూడా తెలియవా, ఆంక్షలు రాష్ట్ర ప్రభుత్వం కావాలని విధించలేదన్నారు. అక్కరకు రాని అంశాలపై రేవంత్ బండి రచ్చ చేస్తున్నారని, తెలంగాణ ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతిని నీతి ఆయోగ్ మెచ్చుకుంది.. వారికి మాత్రం కనబడడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి బ్రదర్స్ లా కలిసి పని చేస్తున్నారని, ఆ రెండు పార్టీ ల ఆఫీస్ లు నాంపల్లి లొనే ఉన్నాయన్నారు. సోషల్ మీడియాలొనే హల్ చల్ తప్ప వారిని ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. అబద్దాలకు రేవంత్ ప్రతినిధి అయితే అరాచకాలకు బండి సంజయ్ ప్రతినిధని, రేవంత్ రచ్చబండ కాంగ్రెస్ కు గుదిబండ కాగా జగ్గారెడ్డి ప్రశ్నలకి ముందు రేవంత్ సమాధానం చెప్పాలన్నారు.

కేసీఆర్ 150 ఎకరాల్లో వరి వేశారనేది అబద్ధం. అక్కడ అంత భూమే లేదని, కేసీఆర్ ధాన్యం ప్రభుత్వం కొంటె అపుడు అడగాలి.. అసలు కొనుగోలు కేంద్రాలు లేకపోతే ఎవరు కొంటారని ప్రశ్నించారు. రేవంత్ ఆత్మ బీజేపీ చుట్టే తిరుగుతోందని, సోనియా రాహుల్ లను తెలంగాణ వరి ధాన్యం పై మాట్లాడమని రేవంత్ ఎందుకు అడగలేదన్నారు. బండి సంజయ్ కేసీఆర్ దీక్ష గురించి వంకరగా మాట్లాడితే ఆ దేవుడే అతన్ని శిక్షిస్తాడని, కేసీఆర్ దీక్ష లేకపోతే కాంగ్రెస్, బీజేపీ లకు తెలంగాణ శాఖలు ఉండేవా అన్నారు. అమృత్ సర్ లో గెలవని తరుణ్ చుగ్ కేసీఆర్ ను విమర్ధించే స్ధాయా? కేసీఆర్ రాజకీయ అనుభవమంత లేదు చుగ్ వయసు అన్నారు.

కేసీఆర్ ను నాదిర్షాతో పొలుస్తాడా? నాదిర్షా ఇరాన్ నుంచి వచ్చి ఇండియా పై దండెత్తాడు. కేసీఆర్ తెలంగాణ లోకల్ వోకల్ అని అమిత్ షా నే తెలంగాణ పాలిట నాదిర్షా అని తెరాస ఎమ్మెల్యేలు ఆరోపించారు. 150 ఎకరాలు ఏ నాయకుడికి ఉండవు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రకారం 51 ఎకరాలకు మించి ఉండకూడదు. తప్పుడు పత్రాలు చూపించడం లో రేవంత్ సిద్ధహస్తుడని, రేవంత్ చూపింది చెప్పింది ఇప్పటిదాకా ఏదీ నిజం కాలేదన్నారు. బ్లాక్ మెయిలింగ్  తప్ప రేవంత్ కు ఏదీ చేత కాదన్నారు.

Also Read : రేవంత్ రెడ్డి అరెస్ట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్