Sunday, March 15, 2026
HomeTrending NewsLoksabha: కాళేశ్వరంపై కేంద్రం అవాస్తవాలు - ఎంపి ప్రభాకర్ రెడ్డి

Loksabha: కాళేశ్వరంపై కేంద్రం అవాస్తవాలు – ఎంపి ప్రభాకర్ రెడ్డి

లోకసభ లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన భారత రాష్ట్ర సమితి ఎంపి ప్రభాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తప్పుడు వివరాలు ఇస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కేంద్రం 86 వేల కోట్లు ఇచ్చిందని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం సహకారం లేకుండానే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఆవాస్తావాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు. తెలంగాణ కు చెందినా బిజెపి ఎంపీలు ఏ రోజు కూడా కాళేశ్వరం కు జాతీయ హోదా కల్పించాలని కోరలేదని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular