Family Counselling :
Q. నేను విచిత్రమైన సమస్యలతో బాధపడుతున్నాను. నాకు బాత్రూములంటే ఎలర్జీ. తలచుకుంటేనే వాంతి వస్తుంది. నా ఇంకో సమస్య దేవుళ్ళు, లైంగికపరమైన అంశాల గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలు. వీటివల్ల సరిగా నిద్రపోలేక పోతున్నాను. తిండి సయించడం లేదు. డాక్టర్లకు చూపించుకుని చికిత్స చేయించుకునే ఆర్థిక శక్తి లేదు. అసలీ సమస్యకు ఎటువంటి పరిష్కారం ఉంటుంది ? మాత్రలేవైనాఉంటాయా? దయచేసి సులభమైన మార్గం చెప్పండి.
-స్వాతి
A. సమస్యలు కొని తెచ్చుకుని తలపట్టుకుంటున్నారు మీరు. అయితే ఇటువంటి ఆలోచనలు మీ ఒక్కరికే కాదు, మనసులో దేనికో బాధ పడుతూ పైకి మామూలుగా ఉండాలని ప్రయత్నించే వారందరికీ సహజమే. మీరేం చదువుకున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. అయితే మీ ఉత్తరాన్ని బట్టి సమాజంపై అవగాహన ఉన్నవారేనని అర్థమవుతోంది. మీ సమస్యకు మానసిక నిపుణుల వద్ద పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్దగా ఖర్చుకాదు. మందులకన్నా మానసిక దృఢత్వం అవసరం మీకు. అప్పుడే ఆలోచనలపై అదుపు సాధించగలుగుతారు. ఇందుకు యోగా, మెడిటేషన్ వంటివీ సహాయపడతాయి. ఊరికే ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకుండా దగ్గర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లి నిపుణుల సలహా తీసుకోండి
Family Counselling
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]
Also Read:
పిల్లల్ని తప్పుపడతాం గానీ పెద్దవాళ్ళు చేసేవన్నీ ఒప్పులు కావు