Sunday, January 19, 2025
Homeఫీచర్స్భయంగా ఉంది

భయంగా ఉంది

Family Counselling :

Q.నా వయసు 21. నేను టీటీసీ కోర్స్ పూర్తి చేసి వాలెంటరీ వర్క్ చేస్తున్నా. మా నాన్నకు మేము నలుగురు ఆడపిల్లలం. ఇన్నాళ్లూ నేను చదువుకోవాలని పెళ్లి చేసుకోలేదు. దాంతో నా చెల్లెళ్లకి పెళ్లి చేసేశారు. నాకు ఏ పనీ తెలీదు. కోపం ఎక్కువ. ఇప్పటికీ చిన్నపిల్లలానే చేస్తూ ఉంటాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది. వచ్చే అబ్బాయి ఎలాంటి ప్రశ్నలేస్తాడో,పెళ్లయ్యాక ఎలాంటి సమస్యలొస్తాయో అని. ఈ విషయంలో నేను ఎలా ఉంటే బాగుంటుందో చెప్పండి.
-దేవి

A.మీది మరీ అంత పెద్ద వయసేం కాదు. చాలామంది ఇంకా చదువుకునే వయసే. మరి మీ కన్నా చిన్న వాళ్ళకి బాల్య వివాహాలు చేశారేమో. సరే, ఇప్పుడు మీరు భయపడడంలోనూ అర్థముంది. చుట్టూ ఎన్నో చూసి ఉంటారు. పైగా చదువు ధ్యాసలో ఉండి పనులు నేర్చుకుని ఉండరు. మీ తల్లిదండ్రులు కూడా చదువుకుంటున్నారని చెప్పి ఉండరు. ఇవన్నీ సాధారణమే. పెళ్లి అంటే ఎన్నో రకాల సర్దుబాట్లు ఉంటాయి. వాటిని తెలుసుకోవాలి. మానసికంగా సిద్ధపడాలి. మీ వ్యక్తిత్వంలో లోపాలు మీకు తెలుసు కాబట్టి దిద్దుకోవడం కష్టం కాదు. ఆ తర్వాత మీకు తగిన వారిని ఎంచుకోవడమూ సమస్య కాదు. ఆల్ ద బెస్ట్!

Family Counselling

-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]

Also Read:

మర్చిపోడానికి చికిత్స ఉందా?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్