Saturday, January 18, 2025
Homeఫీచర్స్ఎలా వేగేది?

ఎలా వేగేది?

Q.నా వివాహమై 9 ఏళ్ళు అయింది. మా వారంటే నాకెంతో ఇష్టం. ఆయనకీ నేనంటే ఇష్టమే కానీ ఈ మధ్య నేను ఏ డ్రెస్ వేసుకున్నా నాకు నప్పడం లేదంటున్నారు. నేను మారాలంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నేను ఎలా మారాలి?
-వనిత

A.మీరు మారాల్సిందే. కానీ ఎలా? శారీరకంగా కాదు. మానసికంగా ముందు దృఢం కావాలి. చాలామంది ఆడవారు వివాహమయ్యాక భర్తే లోకంగా ఉంటారు. తమ ఇష్టాలు, అభిరుచులు ఒక్కోటీ వదిలేస్తారు. స్నేహితులు తగ్గిపోతారు. అంతకుముందున్న ఆసక్తులు, అభిరుచులు మర్చిపోతారు. పిల్లలు , భర్త ఏవేవి ఇష్టపడతారో అవే చేస్తారు. ఇక వ్యక్తిగత శ్రద్ధ కూడా తగ్గిపోతుంది. ఇంట్లోనే ఉంటాం కదా అని పనిలో ఉంటూ వ్యాయామం జోలికి పోరు. ఆ కాస్త సమయంలో ఇంకో పని చెయ్యచ్చుకదా అనుకుంటారు. తమ కోసం ఇంత శ్రమించే భార్యలని ఒక్కమాటతో తీసిపారేయడం భర్త, పిల్లలకే చెల్లుతుంది. అలా అనే బదులు ఎలా ఉండాలో చెప్పచ్చుకదా! అబ్బే అలా చెప్తే వారికి పని తగులుతుందని భయం. అయితే ఇప్పుడిప్పుడు చాలామంది భార్యలను చలాకీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నారు. అంచేత మీరు ముందుగా చెయ్యాల్సింది మీకంటూ కొంత సమయం కేటాయించుకోవడం,దాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఏదన్న వ్యాయామం ఎంచుకోండి. మీ అభిరుచికి తగిన వ్యాపకం కల్పించుకోండి. ఆహారం, ఆరోగ్యం అంశాల్లో కుటుంబానికంతా పనికొచ్చే ప్రణాళిక వేసుకోండి. వీటిలో మీ వారిని భాగస్వాముల్ని చెయ్యండి. ఆహారంలో చిన్నచిన్న మార్పులు, ఆరోగ్యానికి కొద్దిపాటి వ్యాయామం మీలో ఎంత ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుందో మీరే తెలుసుకుంటారు. ఆల్ ద బెస్ట్.

కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్