Sunday, March 3, 2024
Homeసినిమాగాడ్ ఫాద‌ర్ పై ఫైర‌వుతున్న ఫ్యాన్స్..?

గాడ్ ఫాద‌ర్ పై ఫైర‌వుతున్న ఫ్యాన్స్..?

మెగాస్టార్ చిరంజీవి  లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాద‌ర్’.  మ‌ల‌యాళ సినిమా ‘లూసీఫ‌ర్‘ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి మోహ‌న‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు.  బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గెస్ట్ రోల్స్ చేయ‌డం విశేషం. ముఖ్య‌పాత్ర‌ల్లో న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ న‌టించారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది.

ఈ మూవీని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఈ డేట్ కి గాడ్ ఫాద‌ర్ మూవీ రాదేమో అనుకుంటే.. లేదు ఖ‌చ్చితంగా వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే ప్ర‌మోష‌న్స్ మాత్రం స్టార్ట్ చేయ‌డం లేదు. ఇటీవ‌ల గాడ్ ఫాద‌ర్ స్పెష‌ల్ సాంగ్ రిలీజ్ చేశారు కానీ.. ఈ సాంగ్ రిలీజ్ అయ్యిందో లేదో కూడా ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ మూవీ మేక‌ర్స్ పై ఫైరవుతున్నారు. ఇంకా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌క‌పోడం పై సోష‌ల్ మీడియాలో త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

చిరంజీవి, సల్మాన్ లాంటి స్టార్ లు ఉన్నారు కాబట్టి జనాలు పోస్టర్ లను చూసి ఎగబడి వచ్చేస్తారని మేకర్స్ భావిస్తున్నారేమో నంటూ ఫైర్ అవుతున్నారు. ప్రమోషన్స్  లేకుండా సినిమాను జనాల్లోకి ఎలా తీసుకు వస్తారంటూ కొందరు విమర్శిస్తున్నారు.

Also Read: గాడ్ ఫాద‌ర్ రిలీజ్ పై కొనసాగుతున్న పుకార్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్