Saturday, January 18, 2025
Homeసినిమాఆకట్టుకుంటున్న మెగా లుంగీ పోస్టర్

ఆకట్టుకుంటున్న మెగా లుంగీ పోస్టర్

‘భీమ్లానాయక్’ లో పవన్ గళ్ల లుంగీ కట్టుకున్న స్టిల్ ను, ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా రామ్ చరణ్ లుంగీతో వున్న స్టిల్ ను కలిపి మెగా ఫ్యాన్స్ ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరితో పాటు మెగాస్టార్ చిరంజీవితో కలిపి బ్లాక్ థీమ్ షర్ట్ వేసుకున్నట్టుగా డిజైన్ చేశారు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ ని ‘గాడ్ ఆఫ్ మాసెస్’గా చిరుని ‘బాస్ ఆఫ్ మాసెస్’ గా రామ్ చరణ్ ని ‘మాన్ ఆఫ్ మాసెస్’ గా అభివర్ణించారు.

ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ మేగాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ కల ఇప్పటికైనా తీరేనా.. ‘మెగా మనం అనే స్థాయిలో ఏ దర్శకుడైనా ఆలోచనతో వస్తే ఈ ముగ్గరు కాదంటారా?’ అనే కామెంట్ లు నెట్టింట వినిపిస్తున్నాయి. అంతా ఆశపడుతున్నట్టుగా ఈ ముగ్గురు కలిసి చెలరేగితే ఫ్యాన్స్ కి పండగే మరి. ఆ రోజు త్వరలోనే రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్