Tuesday, March 17, 2026
HomeTrending Newsసజావుగా ధాన్యం సేకరణ -మంత్రి గంగుల

సజావుగా ధాన్యం సేకరణ -మంత్రి గంగుల

రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా, సంత్రుప్తికరంగా కొనసాగుతుందని ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని, పుకార్లు, గాలిమాటల్ని రైతులు నమ్మెద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందుబాటులోని గన్నీలు, ఇతరత్రా సామాగ్రి, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలతో శ్వేత పత్రం విడుదల చేసారు. 3వేల కోట్ల నష్టాన్ని భరించి కొనుగోల్లకు ఆదేశాలు జారీ చేసామన్నారు. అసని  తుఫాన్ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ధాన్యం తడవకుండా ఏర్పాట్లు, ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లోని తన కార్యాలయంలో బుదవారం మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 8 కోట్ల 85 లక్షల గన్నీలు ప్రస్థుతం అందుబాటులో ఉన్నాయని ఇందులో ఇప్పటి వరకూ కేవలం 2.5 కోట్ల గన్నీలను మాత్రమే వాడామని ఇంకా 6.35 కోట్ల గన్నీలు అందుబాటులో ఉన్నాయని వీటి ద్వారా మరో 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగలమని, అవసరమైన మేర అన్ని అందుబాటులో ఉంచుకున్నామన్నారు,

అసని తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ శాఖకు చెందిన డీసీఎస్వోలు, డీఎంలు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2,77,866 టార్పాలిన్లు, 11,523 వెయింగ్ మిషన్లు, 11,000 మాయిశ్చర్ మీటర్లు, 4,958 పాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసే ప్రకారం అన్నీ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని, ఎక్కడైనా స్టోరేజి కొరత ఉన్నచోట లీజుకు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు మంత్రి గంగుల.
రాష్ట్రంలో నిన్నటి వరకూ 5774 కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించామని, 28జిల్లాల్లో 3760 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని వీటి ద్వారా 1 లక్షా 56వేల మంది రైతుల నుండి 2121 కోట్ల విలువ గల 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని ఇందులో 10 లక్షల మెట్రిక్ టన్నుల్ని మిల్లులకు తరలించామన్నారు. యాసంగి, వానాకాలం ధాన్యం సీఎంఆర్ గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి గంగుల.
ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని, ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నామని ఇప్పటివరకూ రైతుల నుండి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదన్నారు, ఎక్కడైనా, ఎవరికైనా ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 1800 425 00333, మరియు 1967 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని రైతులకు సూచించారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి, పౌరసరపరాల సంస్థ జీఎం రాజారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular