Friday, March 29, 2024
HomeTrending Newsట్రస్ట్ బోర్డ్ ద్వారా హెల్త్ స్కింకు ఉత్తర్వులు

ట్రస్ట్ బోర్డ్ ద్వారా హెల్త్ స్కింకు ఉత్తర్వులు

ఆర్ధిక, వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావును హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో నేతలు కలిసి  తెలంగాణ ఉద్యోగుల హెల్త్ స్కిం,పెన్షనర్స్ హెల్త్ స్కిం ను ట్రస్ట్ బోర్డ్ ద్వారా అమలు చేయాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఉద్యోగుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీఎన్జీవో  సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, జనరల్ సెక్రటరీ ప్రతాప్ తదితరులు ఉన్నారు.

పీఆర్సీ కమిటీ నివేదిక లో ఉద్యోగుల జీతం నుండి ఒక్క శాతం మూల వేతనం ఇవ్వాలని చెప్పింది. ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ 7 శాతం మాత్రమే జీతాలు పెంచాలని తెలిపింది. అయితే సీఎం కేసీఆర్ ఉద్యోగ పక్షపాతి కావున మాకు 30 శాతం పీఆర్సీ ఇచ్చారు.సీఎం కేసీఆర్ ఎప్పుడు ఉద్యోగుల పక్షాన ఉంటారు,అందుకు మా వంతుగా పీఆర్సీ కమిటీ హెల్త్ స్కిం కు ఒక్క శాతం ఇవ్వమంటే మేము మా ఉద్యోగులకు అండగా ఉన్న సీఎం కు మేము కూడా తోడ్పాటు గా ఉండాలని 2 శాతం కంట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకున్నామని ఉద్యోగాసంఘాల నేతలు వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్ లకు మెరుగైన వైద్యం అందించాలని గతంలో సీఎం కేసీఆర్ ను కోరాంమని నేతలు తెలిపారు. అందుకు మేము పీఆర్సీ కమిటీ సూచించిన ఒక్క శాతంకు అదనంగా మా వంతుగా మరొక శాతం కలిపి మొత్తం రెండు శాతం మూల వేతనం నుండి ఇస్తాం అని ఇవాళ మంత్రి హరీష్ రావు కలిశామన్నారు.

రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేట్ హాస్పిటల్ లలో ఇక నుండి ఉచిత వైద్యం అందించాలని కోరామని, దానికి మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారని హర్షం వ్యక్తం చేసిన టీఎన్జీవో అధ్యక్షుడు మామిడ్ల రాజేందర్, జనరల్ సెక్రటరీ ప్రతాప్.

Also Read :తెలంగాణలో నోటి కాన్సర్ లు ఎక్కువ – మంత్రి హరీష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్