Tuesday, June 16, 2026
HomeTrending NewsCrop Loss: రైతులకు అండగా ప్రభుత్వం - మంత్రి కేటిఆర్

Crop Loss: రైతులకు అండగా ప్రభుత్వం – మంత్రి కేటిఆర్

రాష్ట్రంలో పడుతున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు.

రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఈ మద్యనే కురిసిన ఆకాల వర్షాల నేపద్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వమని రాష్ర్టంలో ఉందన్న కెటియార్… రైతులు ధైర్యం కోల్పోవద్దని, రైతులకు అండగా కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. రానున్న ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికార యంత్రంగానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular