తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలని అడుగుతున్న బండి సంజయ్..ముందు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారన్నారు. దీనిని బట్టే ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదని అర్థం కావడం లేదా అన్నారు.

పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ. 10 వేలు సాయం చొప్పున, రూ. 228 కోట్లు ప్రకటించి రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారని మంత్రి గుర్తు చేశారు. బిజెపి నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం. దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా?

నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, నేడు ఆదాని ఆదాయాన్ని డబుల్ చేశారని మంత్రి ఆరోపించారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ, నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర మీది. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు, రైతు సంక్షేమం గురించి బిజెపి నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని మంత్రి హరీష్ రావు విమర్శించారు.

Also Read : Hail Storm: ఎకరానికి పదివేలు పరిహారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *