Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్FIH Pro-League: ఇండియాపై బెల్జియం గెలుపు

FIH Pro-League: ఇండియాపై బెల్జియం గెలుపు

ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్.ఐ.హెచ్.) ఆధ్వర్యంలో నిర్వహించే హాకీ పురుషుల ప్రో లీగ్ 2022-23 సీజన్ మ్యాచ్ లు దాదాపు నెలరోజుల విరామం తర్వాత నేడు మొదలయ్యాయి. గ్రేట్ బ్రిటన్ లోని లండన్ లో జరిగిన నేటి మ్యాచ్ లో ఇండియాపై బెల్జియం ­2-1 తేడాతో విజయం సాధించింది. ఆట మరి కొన్ని క్షణాల్లో ముగుస్తుందనగా బెల్జియం ఆటగాడు ఒనానా నెల్సన్ అద్భుతమైన పెనాల్టీ కార్నర్ గోల్ చేసి ఇండియాను ఓడించాడు.

ఆట 18వ నిమిషంలో బెల్జియం పెనాల్టీ కార్నర్ ద్వారా తొలి గోల్ సాధించింది. 25వ నిమిషం వద్ద ఇండియా ప్లేయర్ మన్ దీప్ సింగ్  పెనాల్టీ కార్నర్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. మ్యాచ్ డ్రా గా ముగిసి షూటౌట్ కు వెళ్ళాల్సి వస్తుందని అందరూ భావిస్తోన్న తరుణంలో నెల్సన్ గోల్ చేసి బెల్జియం ను గెలిపించాడు.

ఈ మ్యాచ్ లో ఓటమి పాలైనా పాయింట్ల పట్టికలో ఇండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 9 మ్యాచ్ లు ఆడి ఐదు విజయాలు, రెండు షూటౌట్ విజయాలు, రెండు ఓటములతో మొత్తం 19 పాయింట్లు సాధించింది.

ఇండియా రేపు బ్రిటన్ తో తలపడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular