Friday, March 29, 2024
HomeTrending Newsసాహస నటుడికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

సాహస నటుడికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

నట శేఖర కృష్ణ మృతిపట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది, సంతాప సూచకంగా ఎల్లుండి షూటింగ్ లకు విరామం ప్రకటించాలని తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి నిర్ణయించింది. పలువురు రాజకీయ నేతలు కూడా కృష్ణ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

మెగా స్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తదితరులు కృష్ణ తనయుడు మహేష్ బాబుకు తమ సానుభూతి తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి మహేష్ బాబుకు భగవంతుడు ఇవ్వాలని పలువురు ప్రార్ధించారు.

చిరంజీవి:
“మాటలకు అందని విషాదం… సూపర్  స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్ళిపోవడం నమ్మశక్యం కావడం లేదు.. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం, సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం… ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం… వీటి కలబోత కృష్ణ గారు”

నందమూరి బాలకృష్ణ
“కృష్ణ గారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు.
ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి”

పవన్ కళ్యాణ్:
“మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది  తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు.  ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను”

జూనియర్ ఎన్టీఆర్:
“కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం. My thoughts are with Mahesh Anna and the family. Om Shanthi. Superstar forever.”

అల్లు అర్జున్:
Heart broken by the demise of Krishna garu. His contribution to the Telugu cinema industry cannot be described in words . A true Superstar by all means . My deepest condolences to his family , well wishers & fans. May his beautiful soul rest in peace. #SuperStarKrishna garu

Also Read :

సినీ ప్రేక్షకుల ప్రేమ పిపాసి..

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్