Sunday, January 19, 2025
HomeTrending Newsముంబై ఘట్కోపర్ లో అగ్నిప్రమాదం

ముంబై ఘట్కోపర్ లో అగ్నిప్రమాదం

Fire Accident At Mumbai Ghatkopar :

ముంబైలో ఈ రోజు ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్‌లో సోమవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు రేగాయి. దీంతో.. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 8 ఫైర్ ఇంజన్లతో స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గోడౌన్ రూఫ్ నుంచి మంటలు ఎగసిపడుతుండటం, నల్లగా పొగలు కమ్ముకోవడంతో ఆ ప్రాంతంలో కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది.

మురికవాడల మధ్యలో ఉన్న ఈ గోడౌన్‌లో మంటలు రేగడంతో ఆ ప్రాంతంలో నివసించే వారంతా ఉలిక్కిపడ్డారు. ముంబైలో మెరకగా ఉండే ప్రాంతాల్లో ఘట్కోపర్లోని అసల్ఫా ప్రాంతం ఒకటి. ఈ హిల్ ప్రాంతంలో చాలా మురికివాడలు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో గోడౌన్‌లో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా అనే విషయం తెలియాల్సి ఉంది.

డిసెంబర్ 28న కూడా ముంబైలోని కండీవాలీ ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లో మంటలు రేగాయి. ఆ బిల్డింగ్ టెర్రాస్‌పై దాదాపు 45 మంది చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది 40 మందిని సురక్షితంగా కాపాడారు. మిగిలిన ఐదుగురు అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్‌కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్