Sunday, January 19, 2025
HomeTrending Newsన్యూయార్క్ లో అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి

న్యూయార్క్ లో అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి

Fire Accident In Newyork :

అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్ న‌గ‌రంలో ఆదివారం జరిగిన ఘోర అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌నలో చిన్నారుల‌తో పాటు మొత్తం 19 మంది చ‌ని పోయిన‌ట్లు స‌మాచారం. చాలా మందికి తీవ్ర గాయాల‌య్యాయి. బ్రోంక్స్ లోని ట్రెమాంట్ విభాగంలో ఉన్న ఎత్తైన భ‌వ‌నంలోని మూడో అంత‌స్తు బ్యూప్లెక్స్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాదానికి సంబంధించి అలారం మోగ‌డంతో అగ్ని మాప‌క విభాగం అప్రమత్తం అయింది అయితే అప్ప‌టికే కొంద‌రు చ‌ని పోయిన‌ట్లు గుర్తించారు.

అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 60 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా గాయ‌ప‌డిన బాధితుల‌లో చాలా మంది పై అంత‌స్తుల్లో ఉన్నవారు కావటం గమనార్హం. తీవ్ర‌మైన పొగ పీల్చ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని న్యూయార్క్ అగ్ని మాప‌క శాఖ క‌మిష‌న‌ర్ డేనియ‌ల్ నీగ్రో వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న భ‌వ‌నం 19 అంత‌స్తుల‌తో కూడుకుని ఉన్న‌ది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఎల‌క్ట్రిక్ స్పేస్ హీట‌ర్ ప‌ని చేయ‌క పోవ‌డం వ‌ల్ల మంట‌లు చెల‌రేగాయ‌ని స‌మాచారం. 16వ అంత‌స్తులో నివసిస్తున్న గుల్లెర్మో శాంచెజ్ అల్ప‌హారం చేస్తుండ‌గా పొగ వాస‌న రావ‌డంతో అనుమానంతో వెంట‌నే 911కి కాల్ చేసిన‌ట్లు తెలిపాడు. న్యూయార్క్ న‌గ‌రంలో ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేని విధంగా అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని నగర మేయ‌ర్ ఎరిక్ ఆడమ్స్ వెల్ల‌డించారు. ప్ర‌మాద ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే స్పందించార‌ని తెలిపారు. దీని వ‌ల్ల ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా కాపాడ‌గ‌లిగార‌ని పేర్కొన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్