Saturday, June 13, 2026
Homeసినిమాసెప్టెంబర్ 2న 'ఫస్ట్ డే ఫస్ట్ షో'

సెప్టెంబర్ 2న ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’

ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బేనర్ లో నిర్మిస్తున్న చిత్రం`ఫస్ట్ డే ఫస్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

డేట్ అనౌన్స్ మెంట్ వీడియో…. థియేటర్లో ఫ్యాన్స్ కోలాహలం, విజిల్స్, చప్పట్లు, తెరపై ఫ్యాన్స్ కురిపించిన కాగితాల వర్షం లాంటి సందడి వాతావరణంతో ఆకట్టుకుంది. ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషన్స్ కంటెంట్ తో ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. టీజర్ తో పాటు మజ్జా మజ్జా, నీ నవ్వే పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular