Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

లెజెండరీ డైరెక్టర్ కోడిరామకృష్ణ ప్ర‌థమ కుమార్తె కోడి దివ్య దీప్తి తన తండ్రి స్పూర్తితో నిర్మాతగా మారారు. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా కార్తీక్ శంకర్ దర్శకత్వంలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ అతిథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు, నిర్మాతలు అల్లు అరవింద్, మురళీ మోహన్, దర్శక, నిర్మాతలు యస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, రాజా రవీంద్ర తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ ను అభినందించారు. హీరోహీరోయిన్లపై ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామలింగేశ్వర రావు క్లాప్ నివ్వగా, ప్రముఖ దర్శకుడు ఏ.యమ్ రత్నం స్విచ్ ఆన్ చేశారు, లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు.

చిత్ర దర్శకుడు కార్తీక్ శంకర్ మాట్లాడుతూ “ఇది నా మొదటి చిత్రం లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి బ్యానర్లో నేను దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన కోడి దివ్య గారికి ధన్యవాదాలు” అన్నారు.

రచయిత భాస్కరపట్ల మాట్లాడుతూ “నేను కోడిరామకృష్ణ గారి డైరెక్షన్ లో రాయలేదు ఆ లోటు తన కుతూరు దివ్య తీస్తున్న ఈ సినిమా ద్వారా తీరుతుంది. మణి గారు మ్యూజిక్ ఇస్తున్నారు. అలాగే కిరణ్ అబ్బవరం తో యస్.ఆర్. కళ్యాణమండపం సినిమాకి వర్క్ చేశాను. మళ్లీ ఇప్పుడు పూర్తి స్థాయిలో చేస్తున్న సినిమా ఇది. కార్తీక్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమ వుతున్నాడు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అన్నారు.

నిర్మాత కోడిదివ్య మాట్లాడుతూ “కోడి దివ్య ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ప్రాజెక్ట్ గా మంచి సినిమా తీయాలని మేము మా బ్యానర్లో ఫస్ట్ స్టెప్ వేస్తున్నాము. మీ అందరి సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నాను” అన్నారు.

“కోడి రామకృష్ణ గారి దీవెనలతో చాలా మంది పెద్దల ఆశీస్సులతో మా మూవీ స్టార్ట్ ఆయినందుకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు బ్లెస్సింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తన మొదటి ప్రొడక్షన్ లో నన్ను హీరోగా పెడుతూ చేస్తున్న దివ్య గారికి ధన్యవాదాలు. మణిశర్మ గారి మ్యూజిక్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం నరసింహ నాయుడు, ఇంద్ర పాటలు విని థియేటర్ లో గోల చేసే వాడిని ఇప్పుడు ఆయన నా సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఈ సినిమా కు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి” అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు.

హీరోయిన్ సంజన ఆనంద్ మాట్లాడుతూ  “పెద్ద బ్యానర్ లో మంచి టీమ్ తో నేను హీరోయిన్ గా నటిస్తున్నాను. ఇది నా మొదటి చిత్రం ఇంత మంచి టీమ్ తో నటించే అవకాశం కల్పించిన నిర్మాత కోడి దివ్య గారికి ధన్యవాదాలు” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com