Saturday, April 20, 2024
Homeసినిమాసెప్టెంబర్ 1న 'ప్రిన్స్' ఫస్ట్ సింగిల్

సెప్టెంబర్ 1న ‘ప్రిన్స్’ ఫస్ట్ సింగిల్

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘ప్రిన్స్‘. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లను సెప్టెంబర్1 నుండి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నిర్మాతలు అదే రోజు ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో లీడ్ పెయిర్ వండర్ ఫుల్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. ఇద్దరూ పసుపు రంగు దుస్తుల్లో వైబ్రెంట్ గా కనిపించారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Also Read : దీపావళికి వస్తున్నశివకార్తికేయన్ ప్రిన్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్