Tuesday, June 16, 2026
Homeసినిమా'వినరో భాగ్యము విష్ణు కథ' ఫస్ట్ సింగిల్ అప్ డేట్

‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటిస్తున్న చిత్రం‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఇందులో కిరణ్‌ కు జంటగా క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ముర‌ళి కిషోర్  అబ్బూరు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయమవుతున్నారు. ఇదివరకే రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సినిమా నుండి మొదటి సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. “వాసవసుహాస” అనే పాటను డిసంబర్ 24 న సాయంత్రం 6:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమాని స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular