Saturday, March 7, 2026
Homeసినిమా'ది ఘోస్ట్' ఫస్ట్ సింగిల్ 'వేగం' విడుదల

‘ది ఘోస్ట్’ ఫస్ట్ సింగిల్ ‘వేగం’ విడుదల

‘అక్కినేని నాగార్జున,  ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్’ ది ఘోస్ట్‘.  థియేట్రికల్ ట్రైలర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. నేడు ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాట సినిమాలోని రొమాంటిక్ సైడ్ ని ఎలిగెంట్ గా ప్రజంట్ చేసింది.  నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించగా, సోనాల్ చౌహాన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. వారి రొమాంటిక్ కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది.

భరత్, సౌరబ్ ద్వయం రొమాంటిక్ ఫీల్‌తో కూడిన ఒక లవ్లీ ట్యూన్ ని స్కోర్ చేశారు. కపిల్ కపిలన్ రమ్య బెహరా పాటని మరింత ఆహ్లాదంగా ప్రజంట్ చేశారు. కృష్ణ మాదినేని సాహిత్యం ఆకట్టుకుంది. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లకు ఈ పాట సరైన ఆరంభాన్ని ఇచ్చింది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

Also Read : నాగ్ ది ఘోస్ట్  రిలీజ్ డేట్ మారిందా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular