Saturday, September 21, 2024
Homeసినిమా‘పుష్ఫ’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

‘పుష్ఫ’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రమిది. ఈ పాన్ ఇండియా మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పుష్ప ఆడియోకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. పుష్ప ఫ‌స్ట్ సాంగ్ ను ఆగ‌స్ట్ 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్రకటించారు. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమాలోని పాటను ఐదుగురు సింగర్స్ తో పాడించారు.

తెలుగులో శివమ్, త‌మిళంలో బెన్నీ ద‌యాల్, క‌న్న‌డ‌లో విజ‌య్ ప్ర‌కాశ్, మ‌ల‌యాళంలో రాహుల్ నంబియార్‌, హిందీలో విశాల్ ద‌ద్లాని ఈ పాట‌ను ఆల‌పించ‌బోతున్నారు. ‘దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుక్కుది పీక.. అంటూ సాగే ఈ పూర్తి పాట‌ను వినాలంటే ఆగ‌స్ట్ 13 వ‌ర‌కు ఆగాల్సిందే. ఇందులో అల్లు అర్జున్‌ ఎర్ర చందనం స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా నటిస్తుంటే.. రష్మిక పల్లెటూరి అమ్మాయిగా నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్‌ విలన్ గా కనిపించనున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న పుష్ప చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ సంవత్సరం చివరిలో ఈ పాన్ ఇండియా మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్