Sunday, June 7, 2026
Homeసినిమాశ్రీవిష్ణు ‘అర్జున ఫల్గుణ’ నుంచి ‘గోదారి వాల్లే సందమామ’ పాట

శ్రీవిష్ణు ‘అర్జున ఫల్గుణ’ నుంచి ‘గోదారి వాల్లే సందమామ’ పాట

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి ‘అర్జున ఫల్గుణ’ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ‘గోదారి వాళ్లే సందమామ’ అంటూ విడుదల చేసిన లిరికల్ వీడియోతో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. గోదావరి జిల్లాల్లో ప్రజల మనస్తత్వాలు, అక్కడి పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఈ పాట సాగుతుంది.

చైతన్య ప్రసాద్ చక్కటి సాహిత్యాన్ని అందించారు. ఈ పాటలో శ్రీవిష్ణు,అమృత అయ్యర్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అమల చేబోలు, అరవింద్ ఈ పాటను ఆలపించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ మంచి బాణీని అందించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ‘అర్జున ఫల్గుణ’ టీజర్‌కు విశేష స్పందన లభించింది. దీంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular