Saturday, June 13, 2026
HomeTrending Newsతెలంగాణలో వరద నష్టం 1400 కోట్లు

తెలంగాణలో వరద నష్టం 1400 కోట్లు

రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాల పై ప్రాధమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్రానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1400 (పద్నాలుగు వందలు) కోట్లు వరద నష్టం సంభవించినట్టుగా కేంద్రానికి నివేదికలు అందించింది. ఈ నేపథ్యంలో రూ.1000 కోట్లను తక్షణ సాయం కింద విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

వరద నష్టం వివరాలు :

వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు కొట్టుకపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు భవనాల శాఖ కు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయితీ రాజ్ శాఖలో 449 కోట్లు., ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 33 కోట్లు., మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 379 కోట్లు., విద్యుత్ శాఖ లో 7 కోట్లు., నష్టం వాటిల్లినట్టు ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికలు సిద్దం చేసి కేంద్రానికి అందచేసాయి. అదే సందర్భంలో ఇండ్లు కూలిపోవడం ముంపునకు గురికావడం తో పాటు వారిని తరలించే క్రమంలో 25 కోట్లు, ఇంకా తదితర వరద నష్టాలు వెరసి మొత్తంగా రూ. 1400 కోట్ల మేరకు రాష్ట్రంలో వరద నష్టం సంభవించిందని అధికారులు నివేదికలు సిద్దం చేసి కేంద్రానికి పంపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular