కృష్ణ నది ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. వరద నీటి ప్రవాహానికి శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ప్రారభామైంది. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 534 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 176.0590 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో 32,434 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 4,713 క్యూసెక్కులుగా ఉంది.
జూరాల ప్రాజెక్టు వరద అప్ డేట్స్
జూరాల ప్రాజెక్టు వద్ద వరద తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు.
పూర్తిస్థాయి నీటిమట్టం: 318.516 M
ప్రస్తుత నీటిమట్టం: 317.900 M
పూర్తి నీటి సామర్థ్యం: 9.657 TMC
ప్రస్తుత నీటి నిల్వ: 8.415 TMC
ప్రస్తుత వరద In Flow: 94,000 క్యూసెక్కులు
దిగువకు నీటి విడుదల:- 1,11,666 క్యూసెక్స్
పూర్తి Out Flow: 1,16,533 కూసెక్కులు.