Tuesday, September 17, 2024
HomeTrending Newsబ్రెజిల్ ఈశాన్యంలో వరదల విలయం

బ్రెజిల్ ఈశాన్యంలో వరదల విలయం

Flooding Northeast Of Brazil :

బ్రెజిల్‌ ఈశాన్య ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. బహియా ప్రావిన్సులో భారీ వరదల కారణంగా సుమారు 18 మంది మరణించారు. 280 మందికి పైగా గాయపడ్డారు. వరదల కారణంగా సుమారు 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు బహియా సివిల్ డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. వరదల ప్రభావం కనీసం 40 పైగా పట్టణాల్లో కనిపిస్తుందని బహియా గవర్నర్​ రుయి కోస్టా ఇల్హెయూస్​ తెలిపారు. బహియాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని బ్రెజిల్ వాతావరణ, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.  భారీ వర్షాలు మంగళవారం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భారీ వర్షాల కారణంగా ఇటాంబే నగరంలో శనివారం అర్ధరాత్రి ఓ ఆనకట్ట తెగిపోవడంతో వరదలు ముంచెత్తుతాయనే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నట్లు స్థానిక మీడియో తెలిపింది. ఇప్పటికే బహియాలో వరద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో బ్రెజిల్ ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు సహజం, ఈ దఫా ఆనకట్టలు తెగటం, నగరాలను వరదలు ముంచెత్తటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Also Read : జనాభా పెరుగుదలకు చైనా పాట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్