ఇండియాలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. దేశంలో కొత్తగా 2,706 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 25 మంది మరణించారు. కరోనా నుంచి 2,070 మంది కోలుకున్నారు. దేశంలో 17,698 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 53,15,26,656 మందికి పైకి ఎగబాకింది. దేశంలో కొవిడ్ మరణాలు 5,24,611కు చేరాయి. మొత్తంగా 4,26,13,440 కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,27,598 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 53,15,26,656కు చేరింది. మరోవైపు కరోనా ధాటికి కొత్తగా 552 మరణించగా.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 63,10,847కు చేరింది.
Also Read : వియాత్నంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా