Friday, March 13, 2026
HomeTrending Newsరైళ్ళలో ఇక కొత్త సౌకర్యం...వాట్సాప్‌ ద్వారా ఫుడ్ ఆర్డర్

రైళ్ళలో ఇక కొత్త సౌకర్యం…వాట్సాప్‌ ద్వారా ఫుడ్ ఆర్డర్

రైలు ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు ఐఆర్‌సీటీసీ మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైలు ప్రయాణికులు వాట్సాప్‌ ద్వారా ఆర్డర్‌ చేస్తే వారి బెర్త్‌ల వద్దకే ఆహారాన్ని అందించనుంది. రెండు దశల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మొదటి దశలో ఈ-టికెట్‌ బుక్‌ చేసుకోగానే ప్రయాణికుడికి www.ecatering.irctc.co.in లింకుతో కూడిన వాట్సాప్‌ మెసేజ్‌ వస్తుంది. ఈ లింక్‌ క్లిక్‌ చేయడం ద్వారా ట్రైను వెళ్లే రూట్లలోని స్టేషన్లలో ఉండే రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని ఆర్డర్‌ చేయవచ్చు. బెర్త్‌ల వద్దకు ఐఆర్‌సీటీసీ ఈ ఆహారాన్ని అందిస్తుంది. ఈ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
రెండో దశలో పూర్తిగా వాట్సాప్‌ ద్వారానే ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ప్రయాణికులు 8750001323కు వాట్సాప్‌ చేస్తే ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ రిైప్లె ఇస్తుంది. అందులోని ఆప్షన్లను ఎంపిక చేస్తూ కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్‌ చేయవచ్చు.

ఎంపిక చేసిన రైళ్లలో
ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో త్వరలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ను బట్టి మరిన్ని రైళ్లలో ప్రారంభించాలని ఐఆర్‌సీటీసీ భావిస్తున్నది.
ఐఆర్‌సీటీసీ ఇప్పటికే ‘ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌’ యాప్‌, www.catering.irctc.co.in వెబ్‌సైట్‌ ద్వారా రైళ్లలో ఈ-క్యాటరింగ్‌ సేవలు అందిస్తున్నది. ఇప్పటివరకు సగటున ప్రతిరోజు 50 వేల మీల్స్‌ను ప్రయాణికులకు అందజేస్తున్నది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular