Sunday, January 19, 2025
HomeTrending Newsతూర్పు ఆఫ్రికాలో ఆహార సంక్షోభం

తూర్పు ఆఫ్రికాలో ఆహార సంక్షోభం

East Africa : రష్యా ఉక్రెయిన్ ప్రభావంతో తూర్పు ఆఫ్రికాలో ఆహార కొరత తీవ్రం అవుతోంది. కెన్యా, సోమాలియా, ఇథియోపియా దేశాల్లో ఆహార సంక్షోభం తీవ్రం అవుతోందని యునిసెఫ్ (UNICEF) హెచ్చరించింది.  పోషకాహారం అందక చిన్నారులు జీవన్మరణ పరిస్థితులు ఎదుర్కుంటున్నారని యునిసెఫ్ ప్రాంతీయ అధికారి రానియా దగాష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు స్పందించకపోతే రాబోయే రోజుల్లో తూర్పు ఆఫ్రికా లోని 17 లక్షల మంది చిన్నారుల భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పారు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆఫ్రికా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీ-7 దేశాలు ఈ అంశంపై స్పందించాలని యునిసెఫ్ కోరింది. యుద్ధ ప్రభావంపై చర్చించేందుకు జీ-7 దేశాలు ఈ నెలలో సమావేశం అవుతున్నాయి.సోమాలియాలో రాజకీయ అస్థిరత, ఉగ్ర దాడులతో సుమారు నాలుగు లక్షల మంది చిన్నారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. గత రెండేళ్లుగా వర్షాలు లేక సోమాలియాలో దుర్భిక్షం తాండవిస్తోంది. దీంతో  ఐదు నెలల్లో 15 శాతం ఆహార కొరత అధికమైంది.

పోష్టికాహారం అందక, సరైన వైద్య సౌకర్యాలు లేక ఇప్పటికే తూర్పు ఆఫ్రికాలో చిన్నారుల మరణాలు పెరిగాయని, రాబోయే అక్టోబర్, డిసెంబర్ మాసాల్లో లక్షల్లో మరణాలు సంభవించే ప్రమాదం ఉందని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.సోమాలియా, కెన్యా, ఇథియోపియా దేశాలు తమ ఆహార అవసరాల కోసం 92 శాతం దిగుమతులకు ఉక్రెయిన్,రష్యా దేశాల మీదనే ఆధారపడ్డాయి. రెండు దేశాల యుద్దంతో గత మూడు నెలలుగా గోధుమల సరఫరా నిలిచిపోయింది.

Also Read : శ్రీలంక బాటలో మరిన్ని దేశాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్