Sunday, January 19, 2025
HomeTrending Newsసిద్ధిపేటలో బాలికలకు కలుషిత ఆహారంపై నిరసనలు

సిద్ధిపేటలో బాలికలకు కలుషిత ఆహారంపై నిరసనలు

గత ఆదివారం సిద్దిపేట జిల్లా బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో విద్యార్థినులు తీవ్ర అస్యస్థకు లోనయ్యారు. 120 మంది విద్యార్థులను విషయం బహిర్గతం కావోద్దనే ఉద్దేశంతో.. పాఠశాలలోనే ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో సోమవారం సాయంత్రం వారిని సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సదరు బాలికలను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హుజూరాబాద్ నుండి సిద్దిపేటకు బయలుదేరిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరిని సిద్దిపేట జిల్లా చిన్నకోడురు పోలీసు సిబ్బంది రామునిపట్ల స్టేజ్ వద్ద అడ్డుకున్నారు. వాహనాన్ని బలవంతంగా అడ్డుకున్న క్రమంలో స్థానిక NSUI మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  పోలీసులను నిలువరించే ప్రయత్నం చెయ్యడంతో ఒక్కసారిగా వాతావరణం రణరంగంగా మారింది. తాను కేవలం వారి ఆరోగ్య పరిస్థితిని మాత్రమే తెలుసుకునే ఉద్దేశంతో పోతున్నామని వెంకట్ బల్మూరి పోలీసులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన పోలీసులు చిన్నకోడురు పోలీస్ స్టేషన్ కి తరలించారు.

సిద్దిపేట పోలిసులు అదుపులోకి తీసుకునే క్రమంలో జరిగిన తోపులాటలో వెంకట్ కి తీవ్ర గాయాలయ్యాయి. మొదట చిన్న కోడూరు పోలీసు స్టేషన్ నుండి బల్మూరి వెంకట్ ని తోగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించి, అనంతరం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కి తరలించగా వెంకట్ సృహ కోల్పోవడంతో గజ్వేల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించడం జరిగింది.

ఎన్. ఎస్ యూ.ఐ అధ్యక్షులు బలమూరి వెంకట్ ను సిద్ధిపేట వద్ద అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతుంది. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు స్పందించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అణచివేస్తున్నారని విమర్శించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్