Friday, April 19, 2024
HomeTrending Newsఅధికార పీఠానికి చేరువలో దేవేంద్ర ఫడ్నవీస్

అధికార పీఠానికి చేరువలో దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్ర అధికార పీఠాన్ని మూడోసారి అధిరోహించేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ సమయాత్తమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు దేవేంద్ర ఫద్నవీస్ ఇంట్లో బీజేపి కోర్ కమిటీ సమావేశం కానుంది. కోర్ కమిటీ సమావేశం తర్వాత దేవేంద్ర ఫద్నవీస్ భవిష్యత్తు కార్యచరణపై అటు స్థానిక‌ బీజేపి నేతలతో పాటు…గోవాలో వున్న షిండే తో ఫోన్ లో సంప్రదించనున్నారు. ఇవ్వాళ గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ప్రభుత్వం ఏర్పాటు చేయల్సింది ఫద్నవీస్ ను కోరే అవకాశం ఉంది. రాజ్ భవన్ నుండి ఆహ్వానం ఆలస్యం అయితే అతిపెద్ద పార్టీ (106) తమదే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు తెలపనున్న దేవేందర్ ఫద్నవీస్.

బిజెపి కూటమి బలం BJP..106, SHINDE SENA..39, MPJS….02, చిన్న పార్టీ లు & స్వతంత్ర ఎమ్మెల్యేలు..18 మంది మద్దతు ఇవ్వనున్నారు. గోవాలోని తాజ్ రిసార్ట్ లో దిగిన షిండే క్యాంపు ఎమ్మెల్యే లు..నిన్న అర్ధరాత్రి ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలను కలసిన  గోవా సీఎం ప్రమోద్ సావంత్. గవర్నర్ భగత్ సింఘ్ కోషియారి దేవేందర్ ఫద్నవీస్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనిస్తే ప్రమాణ స్వీకారం సమయానికి షిండే వర్గం ఎమ్మెల్యే లు ముంబై చేరుకోవాలని షిండే వర్గానికి తెలియజేసిన బీజేపి జాతీయ నాయకత్వం.

షిండే

రెబెల్ ఎమ్మెల్యేలు ముంబై వస్తే ఎలాంటి అవాంచనీయ దాడులు జరగకుండా వుండటానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబై..థానే..కళ్యాణ్ తో పాటు సున్నితమైన ప్రాంతాలు, నియోజకవర్గాలలో కేంద్ర బలగాలు మొహరించారు. మరోవైపు ముంబై కొత్త పోలీస్ కమీషనర్ గా వివేక్ ఫనసాల్కర్ వచ్చారు. ప్రస్తుత కమీషనర్ సంజయ్ పాండే ఇవ్వాళ రిటైర్ కానున్నారు.

Also Read సిఎం పదవికి ఉద్దావ్ థాకరే రాజీనామా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్