Sunday, June 14, 2026
HomeTrending Newsఆటోను తాకిన విద్యుత్ వైర్: ఎనిమిదిమంది దహనం

ఆటోను తాకిన విద్యుత్ వైర్: ఎనిమిదిమంది దహనం

Tragedy: శ్రీ సత్యసాయి జిల్లా  తాడిమర్రి మండలం చిల్లకొండయ్య పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ప్రయాణికులతో వెళుతోన్న ఆటోకు హై టెన్షన్ విద్యుత్ వైర్ తాకి ఆటో దగ్ధమైంది. దీనితో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు.  వీరంతా సమీపంలోని గుడ్డం పల్లి వాసులుగా గుర్తించారు.

విదేశీ పర్యటనలో ఉన్న సిఎం జగన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి పరిస్థితిని అడిగి తెసులుకున్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular