Monday, March 9, 2026
Homeస్పోర్ట్స్ఫ్రెంచ్ ఓపెన్ లో మరో సంచలనం

ఫ్రెంచ్ ఓపెన్ లో మరో సంచలనం

ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ లో పలు సంచలనాలు నమోదవుతున్నాయి. ఫెదరర్ అర్ధంతరంగా నిష్క్రమించడం, సెరెనా విలియమ్స్ ప్రీ క్వార్టర్స్ లోనే ఓటమి పాలుకావడం తెలిసిందే.  మహిళల విభాగంలో నిన్న కోకో గాఫ్ క్వార్టర్స్ కు చేరుకోగా నేడు ప్రపంచ ర్యాంకింగ్స్ లోన్ 85 వ స్థానంలో ఉన్న స్లోవేనియా క్రీడాకారిణి టమరా జిదాన్‌సెక్‌ సెమి ఫైనల్ కు చేరుకున్నారు. స్పెయిన్ కు చెందినా పాలా బదోసాపై 7-5, 4-6, 8-6 తో గెలుపొంది సెమి ఫైనల్ కు చేరిన తోలి స్లోవేనియా క్రీడాకారిణి గా రికార్డు సృష్టించారు.

సెమిస్ లో ఆమె రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి పావ్యుచెంకోవా అనస్తాసియా సెర్జీవ్నా తో తలపడనుంది. ఈరోజు జరిగిన మరో క్వార్టర్స్ లో అనస్తాసియా కజికిస్తాన్ కు చెందిన ఎలీనా రిబాకినాపై 7-6, 2-6, 7-9 తో గెలుపొంది సెమీస్ కు చేరుకుంది. రేపు మహిళల సింగిల్స్ లో మరో రెండు క్వార్టర్ ఫైనల్స్ జరగబోతున్నాయి. గత సీజన్ కు భిన్నంగా అన్ సీడెడ్ ఆటగాళ్ళు, యువ ఆటగాళ్ళు మంచి ప్రతిభ కనబరుస్తూ దూసుకుపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular