Tuesday, September 17, 2024
Homeస్పోర్ట్స్The Ashes: బెయిర్ స్టో సెంచరీ మిస్ - పట్టుబిగించిన ఇంగ్లాండ్

The Ashes: బెయిర్ స్టో సెంచరీ మిస్ – పట్టుబిగించిన ఇంగ్లాండ్

యాషెస్ సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ లో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ పట్టు  బిగించింది. నిన్న నాటౌట్ గా ఉన్న హ్యారీ బ్రూక్ (61); బెన్ స్టోక్స్ (51) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు.  క్రిస్ ఓక్స్-నాటౌట్; మార్క్ వుడ్-6; స్టువార్ట్ బ్రాడ్-7 త్వరగా ఔటయ్యారు. బెయిర్ స్టో- అండర్సన్ లు పదో వికెట్ కు 66 పరుగులు జోడించారు. ధాటిగా ఆడి 81 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 99 పరుగులు చేసిన బెయిర్ స్టో…. మరో ఎండ్ లో ఉన్న అండర్సన్ ఎల్బీగా వెనుదిరగడంతో ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయి నాటౌట్ గా మిగిలాడు.

 ఆసీస్ బౌలర్లలో హాజెల్ వుడ్ 5; మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ చెరో 2; కమ్మిన్స్ ఒక వికెట్ సాధించారు.

275 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఉస్మాన్స్ ఖవాజా-18; డేవిడ్ వార్నర్-28; స్టీవ్ స్మిత్-17; ట్రావిస్ హెడ్-1 పరుగులు చేసి అవుట్ కాగా, లబుషేన్-44; మిచెల్ మార్ష్-11 తో క్రీజులో ఉన్నారు.  మార్క్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టి కంగారూల టాపార్డర్ ను దెబ్బతీశాడు. మరో వికెట్ ఓక్స్ కు దక్కింది.

ఆస్ట్రేలియా ఇంకా 162  పరుగులు వెనకబడి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్