Wednesday, April 16, 2025
HomeTrending Newsనంద్యాల జిల్లాలో పులి పిల్లలు

నంద్యాల జిల్లాలో పులి పిల్లలు

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో పెద్ద పులి పిల్లలు కలకలం రేపాయి.
పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గ్రామస్థులు గుర్తించారు. ఇటీవలే జన్మించిన ఈ పులి పిల్లలపై  కుక్కలు దాడి చేసి గాయపరిచే అవకాశం ఉందని భావించిన గ్రామస్తులు వాటిని ఓ గది లో జాగ్రత్తగా భద్రపరిచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

అటవీ శాఖా అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని సమీపంలోని పులుల సంరక్షణ కేంద్రానికి తరలించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్