Thursday, April 25, 2024
HomeTrending Newsఅది లోకల్ ఫేక్ సమ్మిట్ : లోకేష్

అది లోకల్ ఫేక్ సమ్మిట్ : లోకేష్

సిఎం జగన్ తన కుటుంబం ఎప్పటినుంచో పోటీ చేస్తున్న పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచారని, తాను ఒక చాలెంజ్ గా తీసుకొని మంగళగిరి నుంచి పోటీ చేశానని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ కు దమ్ముంటే పులివెందుల నుంచి కాకుండా వేరే చోట నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. గత ఎన్నికల్లో తాను కావాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా పోటీ చేసి ఉండేవాడినని, కానీ ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎపుడూ టిడిపి గెలవని మంగళగిరి నుంచి పోటీ చేశానని అన్నారు. యువ గళం పాదయాత్ర అన్నమయ్య జిల్లా  పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్ర విడిది ప్రదేశం వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ లో  లోకేష్ విలేకరులతో మాట్లాడారు.

వైజాగ్ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని లోకల్ ఫేక్ సమ్మిట్ అని, వాటిలో చాలా కంపెనీల పేర్లు అసలు చెప్పలేదని, దావోస్ లో చేసుకున్న ఒప్పందాలే మళ్ళీ ఇక్కడ చేసుకున్నట్లు చూపించారని ఎద్దేవా చేశారు. విదేశీ పెట్టుబడుల్లో ఆంధ్ర ప్రదేశ్ 14వ స్థానానికి పడిపోయిందని, తెలుగుదేశం ప్రభుత్వ హయంలో కష్టపడి తీసుకు వచ్చిన పరిశ్రమలను బెదిరించి మరీ ఇక్కడినుంచి తరిమేశారని లోకేష్ ఆరోపించారు. ఒక్క అమర్ రాజా కంపెనీ ఇక్కడినుంచి వెళ్ళిపోవడం వల్లే దాదాపు 20వేల ఉయోగాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయంలో జిల్లాల వారీగా తీసుకు వచ్చిన కంపెనీల పేర్లు వివరించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పథకాలు రద్దు చేస్తామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని,దాన్ని నమ్మవద్దని… సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్