Saturday, March 7, 2026
HomeTrending NewsBus Accident: పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం- ఇద్దరి మృతి

Bus Accident: పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం- ఇద్దరి మృతి

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా  పాడేరు ఘాట్ రోడ్డు లో జరిగిన బస్సు ప్రమాదంలో  ఇద్దరు మృతి చెందారు.  పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపోయింట్ వద్ద  ఆర్టీసీ బస్సు అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడిపోయింది.  ఈ బస్సు  పాడేరు నుండి చోడవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు.  వీరిలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

కాగా, ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి వెళ్లాల్సిందిగా  అల్లూరి , అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లను సిఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.  బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని, ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular