Saturday, April 20, 2024
HomeTrending NewsTelangana: 18న తెలంగాణ కేబినెట్ స‌మావేశం

Telangana: 18న తెలంగాణ కేబినెట్ స‌మావేశం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్రమంతా వైభవోపేతంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరుగనున్నది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్‌ చైర్మన్లు, జడ్పీ చైర్మ న్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో పార్టీ శ్రేణుల భాగస్వామ్యం ఎలా ఉండాలి? ఏయే అంశాలను పార్టీ ప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి? వంటి అంశాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారు.

మరోవైపు ఈ నెల 18వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. తెలంగాణ స‌చివాల‌యంలో రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గం స‌మావేశం కానుంది. మంత్రుల‌తో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. కొత్త స‌చివాల‌యంలో తొలి కేబినెట్ స‌మావేశం ఇదే. ఈ కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్