భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది. ఐఎండీ ప్రకటన.. మరో రెండు రోజుల్లో తొలకరి పలకరింపుతో దక్షిణాది ప్రజలు పులకరించపోనున్నారనే సంకేతాన్ని ఇచ్చింది. ఆ తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు మాన్‌సూన్ విస్తరించనుంది.
Monsoon: మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాల రాక
ఏప్రిల్ నెల పూర్తిగా, మే నెల మొదటి వారంలో ఎండలు పెద్దగా లేకపోయినా తర్వాత క్రమంగా ఎండల తీవ్రత పెరిగింది. మే ఆఖరి వారం నుంచి ఇప్పటివరకు (జూన్ మొదటి వారం) నిత్యం 40 డిగ్రీల కంటే పైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో పగటి వేళల్లో జనం ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటేనే వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తొలకరి పలకరించనుందంటూ ఐఎండీ తీపి కబురు చెప్పింది.