Saturday, April 20, 2024
HomeTrending NewsG.O 317 తక్షణమే నిలిపివేయాలి-జీవన్ రెడ్డి

G.O 317 తక్షణమే నిలిపివేయాలి-జీవన్ రెడ్డి

GO 317 Jeevan Reddy :

G.O 317 తక్షణమే నిలుపుదల చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. ఉద్యోగుస్తులు, ఉపాధ్యాయులకు స్థానికతను పరిరక్షింపబడే విధంగా రూపొందించిన G.O 317డి కి విఘాతం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ నంబర్ 317 తక్షణమే నిలుపదల చేయాలని జగిత్యాలలో డిమాండ్ చేశారు.  బిశ్వాల్ కమిటీ ఆధ్వర్యంలో 31న డిసెంబర్ 2020 నాడు సమర్పించబడ్డ పి ఆర్ సి నివేదికలో రాష్ట్రంలో 1 లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్టు పేర్కొనటముతో, రాష్ట్రంలోని నిరుద్యోగుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో మనం ఉహించవచ్చన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అన్ని నిరసన వ్యక్తం చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులను, ఆందోళనలను  పరిగణలోకి తీసుకొనక రాష్ట్ర ప్రభుత్వ నియంతృత విధానానికి నిదర్శనంగా పేర్కొనక తప్పదన్నారు. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి మంత్రులుగా ఉండి ఏమి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి అసలు స్థానికత అంటే ఏంటని తెలియని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెరాస ఎమ్మెల్యేలు కూడా సియం దృష్టికి తీసుకపోవడానికి కూడా జంకుతున్నారని ఎద్దేవా చేసారు. ఇది ఇలాగే కొనసాగితే తెరాస ప్రభుత్వంపై యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వారి స్థానికతను కలిగి ఉండి కూడా కేవలం వారు వారి స్థానికతకు సంబంధం లేకుండ కేవలం ఉద్యోగ నియామకముతో జూనియర్ కావటముతో వారు ఏ జిల్లాకు కేటయింపబడుతున్నరో, ఏ జోన్ కు కేటాయింప బడుతున్నారని కూడా, ఊహించలేని పరిస్థితి ఎదురవుతుందని చెప్పకతప్పదన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే స్థానికతకు ప్రాధాన్యత లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ, ఈనాడు స్థానికతకను ఏమాత్రం పరిగణలోక తీసుకొనకుండ రాజ్యాంగ సవరణ రాష్ట్ర పతి ఉత్తర్వులతో వెలువడ్డ ఆర్టికల్ 371 కి విఘాతం కలిగించే విధంగా జీవో.317 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగస్తులు ఉపాధ్యయులందరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని జీవన్ రెడ్డి విమర్శించారు. వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, హఠాన్మరణాలకు దారి తీయటం యావత్ సమాజాన్ని తీవ్రంగా కలిచి వేస్తుందని చెప్పకతప్పదన్నారు. ఈ పరిస్థితులలో రాష్ట్రప్రభుత్వం ఉద్యోగస్తులను స్థానికతకు ప్రాధాన్యత కల్పింపబడే విధంగా పొందుపరిచిన ఆర్టికల్ 371-డి కి విఘాతకలిగించే విధంగా జారీ చేయబడ్డ .జోవో 317 ను తక్షణమో నిలుపుదల చేయించి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి,ఆర్టికల్ 371-డి కి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

Also Read : 317 జీవో సవరించాలి – బిజెపి

RELATED ARTICLES

Most Popular

న్యూస్