Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

శ్రియ శరన్, నిత్య మీనన్, ప్రియాంక జవాల్కర్ , శివ కందుకూరి, సుహాస్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం గమనం. ఈ చిత్రాన్ని క్రియా ఫిల్మ్ కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి సుజనారావు దర్శకత్వం వహించారు. విభిన్న కథాంశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ “గమనం చాలా ప్రత్యేకమయిన సినిమా. ఈ కధ చెప్పినప్పుడే ఈ సినిమాకి రాయాలి అనిపించింది.  డైరెక్టర్ సృజన గారి తపన సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. సృజన గారి ఆలోచనలు చాలా కొత్త గా ఉంటాయి. బాబా గారి కుటుంబలో నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూసుకుంటారు. కధ బాగుంటేనే బాబా గారు నిర్మాణంలో భాగం అవుతారు. ఇళయరాజా గారితో స్క్రీన్ లో నా నేమ్ పడటం నా అదృష్టం, శ్రియ గారితో గౌతమి పుత్ర శాతకర్ణి, ఇప్పుడు గమనం చేయటం చాలా సంతోషం. చాలా మంచి నటి ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను” అన్నారు.


డైరెక్టర్ సృజనరావు మాట్లాడుతూ “ఇళయరాజా గారు, సాయి మాధవ్ గారు, బాబా గారు, శ్రియ గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో చేయటం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏ కధ చెప్పిన కానీ దానికి ఒక మోరల్ ఉండాలి. అలాంటి కధనే మా ఈ గమనం సినిమా. చిన్న కధ రాసి బాబా గారికి, జ్ఞాన శేఖర్ గారికి చెప్పాను స్టార్ చేద్దాం అన్నారు. తరువాత ఇళయరాజా గారికి చెప్పాను ఆయన విని నచ్చితే చేస్తాను అన్నారు. విన్న తర్వాత లే నిలబడు అన్నారు నాకు భయం వేసింది, తర్వాత ఫోటో తీసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది, ‘గమనం’ సినిమా మనం చేస్తున్నాం అన్నారు. తరువాత శ్రీయ గారికి చెప్పాను తనకి బాగా నచ్చింది మనం కధ చేస్తున్నాం అన్నారు, తరువాత సాయిమాధవ్ బుర్ర గారికి స్టోరీ నరేట్ చేశాను చాలా ఇన్ పుట్స్ ఇచ్చారు. అలా సాయి మాధవ్ గారు మాతో ట్రావెల్ అవ్వటం జరిగింది, శివ కందుకూరికి తన క్యారెక్టర్ చెప్పాను, ప్రియాంక జవాల్కర్ గారికి చెప్పాను ఇద్దరు విన్న వెంటనే ఓకే చెప్పేసారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్స్ గా మను, భాను నటించారు వాళ్ళకి నా థాంక్స్” అని చెప్పారు.

 
శ్రియ శరన్ మాట్లాడుతూ “థాంక్ యు సృజన, గమనం కధ సృజన హార్ట్ నుంచి వచ్చిన కథ, ‘గమనం’ సినిమాలో నేను భాగమైనందుకు సంతోషంగా వుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా థ్యాంక్స్. సాయిమాధవ్ గారికి, బాబా గారికి, డైరెక్టర్ సృజన గారికి నా స్పెషల్ థాంక్స్” అని చెప్పారు.

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ “సినిమా గురించి మాట్లాడి చాలా రోజులు అయ్యింది, ‘గమనం’ చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ సినిమా లోని ప్రతి క్యారెక్టర్ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా చూశాక మీరు నేను చెప్పింది కరెక్ట్ అంటారు. మా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. త్వరలోనే సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం, మీకు అందరకి నచ్చుతుంది” అన్నారు.

ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ “ఈ స్టోరీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతి సినిమాకి ఇలానే చెప్తున్నాను. ఫిల్మ్ కి వర్క్ చేస్తున్నప్పుడు మంచి క్వాలిటీ వున్న సినిమా చేస్తున్నాను అనిపించింది, శివతో వర్క్ చేయటం చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను. మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. శ్రియ గారు చాలా అందంగా వుంటారు. మా సినిమాకి శ్రీయ గారి వల్ల చాలా అందం వచ్చింది. తప్పకుండా ‘గమనం’ అందరికీ నచ్చుతుంది” అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com