Tuesday, June 16, 2026
Homeసినిమాకమల పాత్రతో ప్రేమలో పడ్డాను : శ్రియా సరన్

కమల పాత్రతో ప్రేమలో పడ్డాను : శ్రియా సరన్

Gamanam Success Meet:
శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘గ‌మ‌నం’. ఈ సినిమాతో  సుజనారావు దర్శకురాలిగా పరిచయమ‌య్యారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్ల పై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమా డిసెంబర్ 10న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

థ్యాంక్స్ మీట్‌లో శ్రియా మాట్లాడుతూ  “కమల పాత్రతో ప్రేమలో పడ్డాను. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణం కెమెరామెన్ బాబా గారు. ఇంత మంచి పాత్రను రాసినందుకు దర్శకురాలు సుజనకు థ్యాంక్స్. అందరూ సినిమాను చూడండి. సాయి మాధవ్ గారు రాసిన డైలాగ్స్ అద్భుతంగా వచ్చాయి. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్” అన్నారు.

శివ కందుకూరి మాట్లాడుతూ “ఫీల్ గుడ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాం. మంచి సినిమాను చూశామని అందరూ చెబుతున్నారు. అదే మాకు పెద్ద విజయం. నాకు అలీ పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు” అన్నారు.

ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాదిలో నా మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. గమనం వంటి సినిమాతో నా ఏడాది ముగుస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంత మంచి సినిమాలో అద్బుతమైన పాత్రను ఇచ్చారు” అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

దర్శకురాలు సుజన మాట్లాడుతూ “సినిమాను వీక్షించి ప్రశంసలు కురిపిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. ఇంత మంచి సంగీతాన్ని, ఆర్ఆర్‌ను ఇచ్చినందుకు ఇళయరాజా గారికి థ్యాంక్స్. కెమెరామెన్, నిర్మాత బాబా (జ్ఞానశేఖర్) గారికి థ్యాంక్స్. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. కమల పాత్రకు శ్రియ జీవం పోశారు. అలీ ఝారా, మనో భాను అందరూ అద్బుతంగా నటించారు. మా ప్రయత్నానికి ఇంతగా సపోర్ట్ చేసిన మీడియాకు.. అలాగే మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్” అన్నారు.

Also Read : ‘గమనం’ ఓ మంచి సినిమా : శివ కందుకూరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular