Ganapasamudram  : కాకతీయుల సామంతరాజు గోన గన్నారెడ్డి 13వ శతాబ్దంలో నిర్మించిన గణప సముద్రం సమైక్య రాష్ట్రంలో వట్టిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేపట్టారు. వందేళ్లలో కేవలం రెండు సార్లు అలుగు దుంకిన గణప సముద్రం .. తెలంగాణ రాష్ట్రంలో మండు వేసవిలో 2018 మే 6న  ఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణమ్మ నీళ్లతో అలుగు పారింది. వనపర్తి జిల్లాలోని గణపసముద్రం అలుగుపారిన సంధర్భంగా 500 మంది కవులతో వనపర్తిలో జలకవితోత్సవం కూడా నిర్వహించారు. ఘణపురం బ్రాంచ్ కెనాల్ కింద గణపసముద్రం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మార్చేందుకు  రూ.47.73 కోట్లు కేటాయిస్తూ జీఓ 77 విడుదల చేసిన ప్రభుత్వం.

ఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఖిల్లా ఘణపురం, అడ్డాకుల, మూసాపేట మండలాలలో 25 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. దీనిలో భాగంగా గణప సముద్రం రిజర్వాయర్ ద్వారా మరో 10 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు. రిజర్వాయర్ గా గణపసముద్రం నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు సంబరాలు చేసుకుంటున్న ఘణపురం రైతాంగం .. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *